కాచిగూడ, జూన్ 30 : జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరి యువకులను కాచిగూడ రైల్వే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. రైల్వే సీఐ ఎల్లప్ప వివరాల ప్రకారం వెస్ట్ మారేడ్ పల్లి ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ కుమారుడు పెద్ది రాఘవేంద్రస్వామి అలియాస్ రాహుల్ (20)వృత్తిరీత్యా ఏసీ టెక్నీషియన్. నామాల గుండు ప్రాంతానికి చెందిన మురళి కుమారుడు దానకోండ్ల శశాంక్(19) వృత్తిరీత్యా ప్లాస్టిక్ కంపెనీలో సేల్స్ మెన్‌గా పని చేస్తున్నాడు.
జూన్ 27వ తేదీ శుక్రవారం అంబర్‌పేటలోని బాపునగర్ ప్రాంతానికి చెందిన బానోతు సేవల్ ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. కాగా, ఐదు మంది వ్యక్తులు కలిసి జమై ఉస్మానియా రైల్వే స్టేషన్ పట్టాలపైకి భానోతు సేవల్ను తీసుకెళ్లి బెదిరించి అతని వద్ద నుంచి రూ.3,000 రూపాయలు, ఖరీదైన సెల్ ఫోను దొంగిలించారు. బాధితుడు ఆటో డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు సోమవారం ఇద్దరి దగ్గర ఖరీదైన సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు రైల్వే సీఏ తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కాచిగూడ రైల్వే పోలీసులు తెలిపారు.