బంజారాహిల్స్,మే 18: ఇంట్లో ఆడుకుంటున్న ఓ రెండేళ్ల చిన్నారిపై ప్రమాదవశాత్తు టీవీ పడడంతో దుర్మరణం పాలయిన ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని ఫస్ట్ లాన్సర్‌లో నివాసం ఉంటున్న లాయఖుద్దీన్ అనే వ్యక్తి కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడు.
అతడి రెండేళ్ల కుమార్తె మెహ్రాజ్ ఫాతిమా ఈనెల 12న ఇంట్లో అడుకుంటున్న క్రమంలో టీవీ స్టాండ్వద్దకు వెళ్లి అడుకుంటున్న క్రమంలో ప్రమాదవశాత్తూ టీవీ స్టాండ్ మీద ఉన్న 22ఇంచుల టీవీ ఆమెపై పడింది. దాంతో చిన్నారి తీవ్రంగా గాయపడడంతో ఆమెను ఉస్మానియా దవాఖానలో చేర్పించారు.
చికిత్స పొందుతున్న బాలిక మంగళవారం తెల్లవారుజామున మృతి చెందింది. ఈ మేరకు బాలిక తండ్రి లాయఖుద్దీన్ బుధవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.