శంషాబాద్ రూరల్, నవంబర్ 25: బ్యాంకాక్ నుంచి పాములు తరలిస్తున్న ఇద్దరు మహిళలను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున జరిగింది. కస్టమ్స్ అధికారుల కథనం ప్రకారం.. బ్యాంకాక్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఇద్దరు మహిళా ప్రయాణికులను అనుమానం వచ్చి తనిఖీ చేయగా పాములు తీసుకొస్తున్నారు.
పాములను ఇక్కడికి తీసుకువచ్చి అమ్ముతున్నారా? లేక మరేదైనా ఉందా? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పాములను తిరిగి బ్యాంకాక్‌కు తరలించారు. ఇద్దరు మహిళలను అరెస్టు చేసి కస్టమ్స్ కేంద్ర కార్యాలయానికి తరలించినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.