Kacheguda | కాచిగూడ, జూన్ 19: జల్సాలకు అలవాటు పడి రద్దీ ఉన్న పలు రైళ్లలో సెల్ఫోన్ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను రైల్వే పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. సికింద్రాబాద్ రైల్వే డిఎస్పి జావేద్, కాచిగూడ రైల్వే సీఐ ఎల్లప్ప తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా తాళ్లపల్లి, పోతుగల్ గ్రామానికి చెందిన కిష్టయ్య కుమారుడు సుక్కయ్య(35)వృత్తిరీత్యా కూలి. అంబర్పేట్లోని బతుకమ్మ కుంట ప్రాంతానికి చెందిన శ్రీను కుమార్తె దాసరి మౌనిక (20)వృత్తిరీత్యా ప్లాస్టిక్ పేపర్లు అమ్ముతుంది. వీరిద్దరూ కలిసి ఈనెల తొమ్మిదవ తేదీన మలక్పేట రైల్వే స్టేషన్ సమీపంలో కనకయ్య అనే వ్యక్తి జేబులో నుంచి ఖరీదైన ఫోను లాక్కొని పారిపోయారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న కాచిగూడ రైల్వే పోలీసులు గురువారం కాచిగూడ రైల్వే స్టేషన్లో పోలీసులు తనిఖీలు చేస్తుండగా అనుమానం వచ్చి వారిద్దరిని ఆరా తీయగా చేసిన దొంగతనం ఒప్పుకున్నారు. వారి నుంచి ఖరీదైన సెల్ఫోన్, రూ.500 స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు రైల్వే సీఐ తెలిపారు.