సిటీబ్యూరో, ఆగస్టు 1(నమస్తే తెలంగాణ): విదేశాలలో డెంటల్ పీజీ సీటు ఇప్పిస్తామంటూ నమ్మించి ఇద్దరు వైద్య విద్యార్థులకు సైబర్ నేరగాళ్లు రూ.6.5 లక్షలు టోకరా వేశారు. ఆర్టీసీ క్రా స్ రోడ్డులో ఉండే బీడీఎస్ వైద్యులు పీజీ చేసే క్రమంలో ఢిల్లీకి చెందిన ఒక కన్సల్టెన్సీ ప్రకటన కనబడటంతో వాళ్లను సంప్రదించారు.
అర్మేని యా దేశంలోని పీజీ సీట్లు ఇప్పిస్తామని నమ్మిం చి దఫదఫాలుగా డబ్బు దోచేశారు. రేపు మాపం టూ కాలయాపన చేస్తుండటంతో విద్యార్థులు అర్మేనియా కాలేజీల గూర్చి ఆరా తీయగా, కన్సల్టెన్సీ చెప్పిన కాలేజీలు ఏవీ లేవని తేలింది.