శేరిలింగంపల్లి, నవంబర్ 15: ప్రమాదవశాత్తు ఓ ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్‌కు ఢీకొని ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు మృతి చెందిన సంఘటన గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ హబీబ్ఉల్లాఖాన్ తెలిపిన వివరాల ప్రకారం… కాకినాడ ప్రాంతానికి చెందిన కేసాని వెంకన్నస్వామి(30) ఐటీ కారిడార్‌లోని అమెజాన్ కంపెనీలో విధులు నిర్వహిస్తుండగా, విశాఖపట్నం హరిజన బస్తీకి చెందిన పిల్లి దేవ్‌కుమార్(25) మైక్రోసాఫ్ట్ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అయితే నానక్‌రాంగూడలోని పీజీ హాస్టల్లో నివాసం ఉంటున్న వీరిద్దరూ గురువారం రాత్రి సెకండ్‌షో సినిమాకు వెళ్లారు.
శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో గచ్చిబౌలి వైపు నుంచి నానక్‌రాంగూడ విప్రో సర్కిల్ వైపు నుంచి ద్విచక్రవాహనంపై తిరిగి ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యలో గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ జంక్షన్లో మలుపుతిరిగి డివైడర్‌కు ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వెంకన్నస్వామి, దేవ్కుమార్ను చికిత్స నిమిత్తం సమీపంలోని కొండాపూర్ జిల్లా దవాఖానకు తరలించగా.. అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బైక్ నడిపిన వెంకన్నస్వామి హెల్మెట్ పెట్టుకున్నా బెల్టు పెట్టుకోకపోవడం, వెనుక కూర్చున్న దేవ్‌కుమార్‌కు హెల్మెట్ లేకపోవడంతో తలకు తీవ్రగాయాలై మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా దవాఖానకు తరలించి గచ్చిబౌలి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.