Drugs | డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు నిందితులు అరెస్ట్
Drugs | డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని రాచకొండ (Rachakonda Commissionerate) పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు(CP Sudhir babu) తెలిపారు. రాజస్థాన్‌కు చెందిన ఓం రామ్, సన్వాల్ అనే ఇద్దరు వ్యక్తులు మధ్య ప్రదేశ్‌కు చెందిన వికాస్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేశారన్నారు.
హైదరాబాద్ : డ్రగ్స్(Drugs) రహిత రాష్ట్రంగా తెలంగాణను మార్చేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా అధికారులు దూకుడు పెంచారు. మత్తు పదార్థాల కట్టడి కోసం ఎక్కడికక్కడ విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. అయినా మత్తు పదార్థాల సరఫరా ఆగటం లేదు. స్మగ్లర్లు రకరకాల మార్గాల ద్వారా డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా, గుట్టు చప్పుడు కాకుండా అవసరం అయిన వారికి డ్రగ్స్ సరఫరా చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు తాజాగా.. డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని రాచకొండ (Rachakonda Commissionerate) పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు(CP Sudhir babu) తెలిపారు.
రాజస్థాన్‌కు చెందిన ఓం రామ్, సన్వాల్ అనే ఇద్దరు వ్యక్తులు మధ్య ప్రదేశ్‌కు చెందిన వికాస్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేశారన్నారు. వీటిని హైదరాబాద్‌లో విక్రయించేందుకు రాగా వారిని జవహర్‌నగర్, ఎల్బీనగర్ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. నిందితుల నుంచి 40 కిలోల పాపిస్ట్రా, 10 గ్రాముల ఎండీఎంఏ, రూ.10 వేల నగదు, 3 సెల్ఫోన్లు, స్వాధీనం చేసుకున్నారు. నిందులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, ఎవరైనా డ్రగ్స్, అమ్మినా, రవాణా చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

