సిటీబ్యూరో, జూన్ 13 (నమస్తే తెలంగాణ) : రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సౌకర్యార్థం బెంగళూరు నుంచి తిరుపతి మధ్య స్టేషన్లో రెండు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు సోమవారం ఎస్సీఆర్ జోన్ అధికారులు ప్రకటించారు. ఈ నెల 14, 15 తేదీల్లో ఈ ప్రత్యేక రైళ్ల రాకపోకలు కొనసాగుతాయన్నారు.