Hyderabad | హైదరాబాద్ పంజాగుట్ట ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి సమయంలో అతివేగంతో వచ్చిన ఓ పల్సర్ బైక్ సైడ్వాల్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు ఫ్లైఓవర్ నుంచి ఎగిరి కిందపడ్డారు.
ఈ ఘటనలో ఇద్దరు యువకుల కాళ్లు, చేతులు విరిగాయి. బేగంపేట నుంచి బంజారాహిల్స్ వస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.