కీసర, ఫిబ్రవరి 25; ఓ బైకును కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. కీసర పోలీసుల కథనం ప్రకారం తార్నాక ప్రాంతానికి చెందిన చంద్రశేఖర్ (32), ఆయన తమ్ముడు మత్య్సగిరి (27), వారి అల్లుడు శ్రీను (17) కలిసి సోమవారం రాత్రి ద్విచక్రం వాహనం మీద కీసరలోని వారి బంధువుల ఇంటికి వచ్చారు. తిరిగి యాద్గార్పల్లి లో సర్వీర్ రోడ్డు మీదుగా ఇంటికి తిరిగి వెళుతున్నారు. దమ్మాయిగూడ మున్సిపాల్టీ పరిధిలోని చీర్యాల్ ప్రాంతంలోని సర్వీస్రోడ్డులో అతివేగంగా వస్తున్న కారు వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.
ఈ రోడ్డు ప్రమాదంలో బైకుపై ఉన్న ముగ్గురు ఒక్కసారిగా కిందపడిపోయారు. అందులో గూడురు చంద్రశేఖర్ అక్కడికక్కడే పడి మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం నగరంలోని గాంధీ దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి దవాఖానలో మత్స్యగిరి మృతిచెందాడు. శ్రీను అనే వ్యక్తి దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసును కీసర పోలీసులు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు.