హైదరాబాద్: నగరంలోని బేగంపేటలో క్లబ్8లో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఆదివారం రాత్రి మద్యం మత్తులో ఈ వర్గాలు గొడవకు దిగాయి. బీరుసీసాలు తీసుకొని ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో బీరుసీసా తగిలి ఒక వ్యక్తి కంటికి తీవ్రమైన గాయమైంది. ఇది గమనించిన క్లబ్ యాజమాన్యం బాధితుడిని వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించింది. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం అతన్ని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి తీసుకెళ్లారు.