సిటీబ్యూరో: దుబాయ్, పుణె నుంచి శంషాబాద్ రావాల్సిన రెండు విమానాలను దారి మళ్లించారు. వాతావరణ ప్రతికూల పరిస్థితుల కారణంగా ఎయిర్పోర్టు నుంచి పక్క రాష్ర్టాలకు మళ్లించినట్లు జీఎంఆర్ ఎయిర్పోర్టు వర్గాలు వెల్లడించాయి. ఉదయం నుంచి వాతావరణంలో ఉన్న ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా మధ్యాహ్నం వరకు సమస్య తలెత్తింది. దీంతో రెండు విమానాలను ఎయిర్లైన్స్ అధికారులు ఇతర నగరాలకు డైవర్ట్ చేసినట్లు తెలిసింది.
ఇందులో పుణె నుంచి రావాల్సిన ఇండిగో విమానాన్ని ఏపీలోని గన్నవరం ఎయిర్పోర్టులో ల్యాండింగ్ చేశారు. ఇక దుబాయి నుంచి హైదరాబాద్ వచ్చే ఇంటర్నేషనల్ సర్వీస్ ఎమిరేట్ విమానాన్ని బెంగళూరు విమానాశ్రయంలో ల్యాండింగ్ చేయించారు. అయితే సాయంత్రానికి వాతావరణం సహకరించడంతో ఆ రెండు విమానాలు శంషాబాద్ ఎయిర్పోర్టులో సురక్షితంగా ల్యాండింగ్ అయ్యాయి.