Hyderabad | హైదరాబాద్ చాంద్రయాణగుట్టలో మృతదేహాలు కనిపించాయి. బుధవారం తెల్లవారుజామున ఓ ఆటోలో ఇద్దరు యువకుల మృతదేహాలు కనిపించడం కలకలం రేపాయి.
ఆటోలో యువకుల మృతదేహాలు కనిపించడంతో కంగారుపడిపోయిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. మృతులను జహంగీర్, ఇర్ఫాన్గా గుర్తించారు. స్టెరాయిడ్స్ ఓవర్ డోస్లో తీసుకోవడం వల్లనే వీరు మృతిచెంది ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.