సిటీబ్యూరో, మే 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించడంతో రాగల రెండు రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ, మరికొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
దీనిని దృష్టిలోపెట్టుకుని నగరానికి ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేశారు. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠం 35.2, కనిష్ఠం 24.6 డిగ్రీలు, గాలిలో తేమ 41 శాతంగా నమోదైనట్లు అధికారులు తెలిపారు.