హైదరాబాద్: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో (Vanasthalipuram) టిప్పర్ లారీ బీభత్సం సృష్టించింది. శనివారం ఉదయం వనస్థలిపురంలోని సుష్మ థియేటర్ వద్ద వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ అదుపుతప్పి బైకును ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు.
మృతులను కూకట్‌పల్లికి చెందిన సతీశ్, వీరబాబుగా గుర్తించారు. వారిద్దరు ఇటుక లోడ్‌ను ఖాళీ చేసేందుకు వనస్థలిపురం వెళ్లినట్లు తెలుస్తున్నది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.