గాలివాన బీభత్సానికి తెగిపడిన విద్యుత్ తీగలు
శంషాబాద్ మండలంలో శుక్రవారం రాత్రి నుంచి వీస్తున్న గాలివాన బీభత్సానికి చెట్లు విరిగిపోవడంతోపాటు విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. నర్కూడ గ్రామంలో మల్లేష్‌యాదవ్ అనే రైతుకు చెందిన నాలుగు గేదెలు విద్యుత్ షాక్‌తో మృతి చెందాయి. గతకొంతకాలం నుంచి విద్యుత్ తీగలు సరి చేయాలని సంబంధిత అధికారులను రైతులు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోకపోవడంతోనే బర్రెలు మృతి చెందినట్లు రైతు మల్లేష్‌యాదవ్ తెలిపారు.
- నర్కూడలో నాలుగు గేదెలు మృతి
శంషాబాద్ రూరల్, జూన్ 13 : శంషాబాద్ మండలంలో శుక్రవారం రాత్రి నుంచి వీస్తున్న గాలివాన బీభత్సానికి చెట్లు విరిగిపోవడంతోపాటు విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. నర్కూడ గ్రామంలో మల్లేష్‌యాదవ్ అనే రైతుకు చెందిన నాలుగు గేదెలు విద్యుత్ షాక్‌తో మృతి చెందాయి. గతకొంతకాలం నుంచి విద్యుత్ తీగలు సరి చేయాలని సంబంధిత అధికారులను రైతులు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోకపోవడంతోనే బర్రెలు మృతి చెందినట్లు రైతు మల్లేష్‌యాదవ్ తెలిపారు.
విద్యుత్ షాక్‌తో గేదెలు మృతి చెందడంతో దాదాపు రూ.5 లక్షల వరకు నష్టం జరిగిందని వివరించారు. విషయం తెలుసుకున్న పశువైద్యాధికారులు ఘటన స్థలానికి చేరుకొని గేదెలకు పోస్టుమార్టం నిర్వహించారు. విద్యుత్‌శాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకొని రైతును ఆదుకునే విధంగా అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యుత్‌షాక్‌తో గేదెలు మృతిచెంది నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని సదరు రైతు కోరారు.
విషయం తెలుసుకున్న సర్పంచ్ శేఖర్‌యాదవ్ రైతును పరామర్శించారు. దీంతో పాటు మండలంలోని వివిధ గ్రామాలలో కురిసిన భారీ వర్షంతో రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఈసీవాగులోకి వరదనీరు భారీగా చేరి హిమాయత్‌సాగర్ చెరువులోకి చేరాయి. శంషాబాద్ పట్టణంలోని పాత పోలీస్‌స్టేషన్ భవనం సమీపంలో శితిలావస్థకు చేరిన గోడ కూలిపోయి పార్కింగ్ చేసిన కారుపై పడడంతో కారు పాక్షికంగా దెబ్బతిన్నట్లు స్థానికులు తెలిపారు. శనివారం మధ్యాహ్నం సమయంలో మరోసారి భారీ వర్షం కురియడంతో మండల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oppo F35 | ఒప్పో నుంచి ఎఫ్35, ఎఫ్35 ప్రో ఫోన్లు విడుదల.. అక్టోబర్ 11 నుంచి సేల్
Electrocution | విద్యుత్ షాక్‌తో కౌలు రైతు మృతి
KTR | రైతుల పట్ల ఇలాగేనా ప్రవర్తించేది.. గజ్వేల్ ఎమ్మార్వోపై కేటీఆర్ ఆగ్రహం
గరీబ్‌పేట గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

