లాభాల పేరిట ఘరానా మోసం
మా వద్ద పెట్టుబడి పెడితే 6 నుంచి 13 శాతం వరకు ప్రతినెలా లాభాలిస్తామంటూ రెండు తెలుగు రాష్ర్టాలలో 200 మంది నుంచి రూ. 530 కోట్లు వసూలు చేసి, మోసం చేసిన ఇద్దరిని సీసీఎస్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. బుధవారం సీసీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర జాయింట్ సీపీ గజారావు భూపాల్, సీసీఎస్ డీసీపీ శిల్పవల్లి వివరాలను వెల్లడించారు.
- 200 మంది నుంచి రూ.530 కోట్లు వసూలు
- గొలుసు కట్టు విధానంలో పెట్టుబడుల ఆకర్షణ
- ఇద్దరు వ్యాపారులు అరెస్టు.. 2 కిలోల బంగారం స్వాధీనం
సిటీబ్యూరో, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): మా వద్ద పెట్టుబడి పెడితే 6 నుంచి 13 శాతం వరకు ప్రతినెలా లాభాలిస్తామంటూ రెండు తెలుగు రాష్ర్టాలలో 200 మంది నుంచి రూ. 530 కోట్లు వసూలు చేసి, మోసం చేసిన ఇద్దరిని సీసీఎస్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. బుధవారం సీసీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర జాయింట్ సీపీ గజారావు భూపాల్, సీసీఎస్ డీసీపీ శిల్పవల్లి వివరాలను వెల్లడించారు. విజయవాడకు చెందిన గుడే రాంబాబు, భీమవరానికి చెందిన పెనమెట్స కృష్ణంరాజు వ్యాపార భాగస్వాములు. లాభాలు రావడంతో వ్యాపారాన్ని విస్తరించేందుకు నిర్ణయించారు.
ఇందుకు తెలిసిన వారి నుంచి ఆర్థిక సాయం తీసుకున్నారు. మొదట్లో మూవింగ్ కన్జుమర్ గూడ్స్‌ను విక్రయిస్తూ, ఆ వ్యాపారాన్ని మరింతగా విస్తరించారు. ఇందుకు తెలిసిన వారు, బంధువులు, స్నేహితుల నుంచి భారీ ఎత్తున పెట్టుబడులు సేకరించారు. పెట్టుబడి పెట్టిన వారికి తొలుత కొన్ని నెలలు 6 శాతం లాభాల చెల్లించారు. ఇలా దాదాపు 200 మంది నుంచి రూ. 530 కోట్లు వరకు వసూలు చేశారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వరకు వచ్చారు. వ్యాపారాన్ని గొలుసు కట్టు విధానంలోకి మార్చేశారు. పెట్టుబడి పెట్టిన వారికి ఇటీవల లాభాలు చెల్లించడంలో ఆలస్యం చేశారు.
దీంతో బాధితుల నుంచి ఒత్తిడి పెరగడంతో మాదాపూర్‌లో ఉన్న ఇంటికి తాళం వేసి.. నిందితులిద్దరూ పరారయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు వీరిద్దరిపై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను గచ్చిబౌలిలో అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రెండు కిలోల బంగారు ఆభరణాలు, రూ.4 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరూ ఏపీ, తెలంగాణలో బాధితుల నుంచి వసూలు చేసిన డబ్బుతో ఆస్తులు కొనుగోలు చేసినట్టు దర్యాప్తులో తేలిందని వెల్లడించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

