హైదరాబాద్ : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజ్( CMR Engineering College) కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏ1 నంద కిశోర్, ఏ2 గోవింద్ కుమార్‌ను రిమాండ్‌కు తరలించారు. సీఎంఆర్ కాలేజీ చైర్మన్ చామకూర గోపాల్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు. అలాగే ఏ3గా ధనలక్ష్మి, ఏ4గా హాస్టల్ వార్డెన్ ప్రీతిరెడ్డి, ఏ5గా ప్రిన్సిపాల్ అనంత నారాయణ, ఏ6గా కాలేజీ డైరెక్టర్ మద్దిరెడ్డి జగన్‌రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా, సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజ్ ఉమెన్స్ హాస్టల్లోని(Women Hostel) బాత్రూంలో అమ్మాయిల వీడియోలు తీశారని ఆరోపిస్తూ ఈ అమానవీయ ఘటనపై విద్యార్థులు ఆందోళన చేపట్టారు. విద్యార్థుల ఆందోళనతో ఎట్టకేలకు దిగొచ్చిన ప్రభుత్వం దర్యాప్తు చేపట్టి నిందితులపై కేసు నమోదు చేసింది.
Madha Gaja Raja | 12 ఏండ్లకు థియేటర్లలోకి.. విశాల్ మదగజరాజ రిలీజ్ టైం ఫిక్స్
Shankar | రాంచరణ్ ఏది అడిగినా చేసేందుకు ఒప్పుకున్నాడు.. గేమ్ ఛేంజర్ ఈవెంట్లో శంకర్