సిటీబ్యూరో, మే 17 (నమస్తే తెలంగాణ): ద్విచక్రవాహనంపై గంజాయి రవాణా చేసి, విక్రయించేందుకు యత్నిస్తున్న ఇద్దరిని మేడ్చల్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.5లక్షల విలువ చేసే 10కిలోల గంజాయి, ద్విచక్రవాహనం, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళి తే…కర్ణాటకకు చెందిన రాము గంజాయి విక్రయిస్తుంటాడు.
అనంతపురం గుంతకల్ ప్రాంతానికి చెందిన చాకలి వంశీ, నేమకల్ వాల్మీకి వేణుగోపాల్ అనే ఇద్దరు యువకులు రాము వద్ద నుంచి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి ద్విచక్రవాహనంపై నగరానికి తరలించారు. శనివారం మధ్యాహ్నం సుచిత్ర కొంపల్లి ప్రాంతానికి వచ్చి, గంజాయిని కొనుగోలుదారుల కోసం ఎదురు చూస్తుండగా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మాధవయ్య, సీఐ నర్సిరెడ్డి, ఎస్ఐ పవన్ కుమార్ రెడ్డి తమ బృందంతో కలిసి వంశీ, వేణుగోపాల్‌ను పట్టుకున్నారు. కేసును కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు.