సిటీబ్యూరో, మే 2 (నమస్తే తెలంగాణ): గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను ఆబ్కారీ ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 3.278 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే…ధూల్‌పేటకు చెందిన సంజయ్ సింగ్ పురాణపూల్ ప్రాంతం జియాగూడ ప్రాంతాల్లో ద్విచక్రవాహనంపై తిరుగుతూ గంజాయి తరలిస్తున్నాడు. సమాచారం అందుకున్న ఎస్టీఎఫ్ పోలీసులు శుక్రవారం నిందితుడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని, అతడి వద్ద నుంచి 2.078కిలో గంజాయితో పాటు ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అంతేకాకుండా ఠాకూర్ అశిష్ సింగ్ , లక్ష్మణ్ సింగ్ , నీరజ్ రాయ్‌లపై కేసు నమోదు చేసినట్లు ఎస్టీఎఫ్ ఈఎస్ అంజిరెడ్డి తెలిపారు.
l మూసాపేట్ జేపీ, భరత్ నగర్ ప్రాంతాల్లో ఎస్టీఎఫ్డీ టీం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందిన కొంపల్లి యశ్వంత్‌సాయి షణ్ముఖ వద్ద 1.20 కేజీల గంజాయితో పాటు ద్విచక్రవాహనం, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ జ్యోతి తెలిపారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును బాలానగర్ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు.