
దుండిగల్, జనవరి 30 : నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లిలో ఎస్ఎల్జీ వైద్యులు ఓ మహిళ మోకాలిచిప్పపై ఏర్పడిన కణితిని శస్త్రచికిత్స ద్వారా తొలగించారు. వివరాలను వైద్యశాల యాజమాన్యం ఓ ప్రకటనలో విడుదల చేసింది. 30 ఏండ్ల వయసున్న కూకట్పల్లి హౌజింగ్ బోర్డ్ కాలనీకి చెందిన ఓ మహిళ నడిచేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతూ గతేడాది డిసెంబర్ 15న బాచుపల్లిలోని ఎస్ఎల్జీ వైద్యశాలలో చికిత్సకు వెళ్లింది. అక్కడి వైద్యులు ఆమెకు ఎక్స్రే, ఎంఆర్ఐ వంటి పరీక్షలు నిర్వహించి ఎడమ కాలు మోకాలి కీలు వద్ద ఉండే ‘పటేల్లా’ ప్రాంతంలో పెద్ద కణితి ఏర్పడినట్లు గుర్తించారు. ఎస్ఎల్జీ వైద్యశాల ఆర్థోపెడిక్ సర్జన్ డా.వి.జగన్మోహన్రెడ్డి శస్త్ర చికిత్స చేసి కణితిని తొలగించారు. కణితి తిరిగి పెరగకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.