హిమాయత్ నగర్ జూన్7: కలియుగ దైవం వేంకటేశ్వరుడి 20వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు శనివారం ఘనంగా ముగిశాయి. హిమాయత్‌నగర్‌లోని లిబర్టీ వద్ద గల తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామి అమ్మవార్లకు పల్లకి ఉత్సవంతో పాటు మహాపూర్ణహుతి, చక్రస్నానం వైభవంగా జరిగింది. పుష్కరిణిలో స్నానం చేయించి మంత్రోచ్ఛరణలు, భజనతో పాటు ధ్వజావరోహణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాల ముగింపు జరిగింది.
సకల దోషాలను తొలగించడానికి పరిపూర్ణుడైన పరమాత్ముడిని ప్రార్థించి భక్తులందరిపై ఆశీస్సులు ఇవ్వాలని ఈ సందర్భంగా భక్తులు కోరుకున్నారు. ఈ నెల 3వ తేదీన ప్రారంభమైన ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో వందలాది మంది భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.