TSRTC | హైదరాబాద్ : ఈ నెల 28(బుధవారం) నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యార్థులకు ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశామని గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి వెంకటేశ్వర్లు వెల్లడించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు రాయితీ బస్ పాస్, హాల్ టికెట్ చూపించి ఉచితంగా ప్రయాణించొచ్చని సూచించారు.
రాయితీ బస్ పాస్ లేని విద్యార్థులకు నామమాత్రపు ధరతో టికెట్ జారీ చేస్తారని వివరించారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అన్నీ రూట్లలో బస్సులు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఎక్కడైన బస్సుల రాకపోకల్లో ఆలస్యమైతే కోఠి-9959226160, రేతిఫైల్-9959226154 నెంబర్లకు ఫోన్ చేసి సమాచారమివ్వాలని కోరారు. ఈ నెంబర్లను సంప్రదిస్తే బస్సుల సమాచారం కూడా తెలియజేస్తారని పేర్కొన్నారు.