మల్లాపూర్, డిసెంబర్ 9 : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టడంతో మహిళలు ఎంతో ఆనందంగా ఉ న్నారని కస్తూర్భా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ సఖి సెంటర్ ఇన్చార్జి పి. పద్మావతి అన్నారు. శనివారం ఆమె.. టీఎస్ఆర్టీసీ కుషాయిగూడ డిపో ఈసీఐఎల్ బస్ స్టేషన్ వద్ద మహాలక్ష్మి ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మధ్య తరగతి ఆడపడుచుల మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ముఖ్యమంత్రి తీసుకున్న సాహసోపేత నిర్ణయానికి మహిళల తరపున ఆమె ధన్యవాదాలు తెలిపారు.
డిపో మేనేజర్ చంద్రకాంత్ మాట్లాడు తూ.. తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం ఉచిత బస్సు ప్ర యాణం అనే పథకాన్ని స్వాగతిస్తూ తెలంగాణ రాష్టమంతటా సిటీ ఆర్డినరి, మెట్రో ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించవచ్చన్నారు. అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఏదైన ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ , పాన్ కార్డును ప్రయాణికులు చూపించి సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డిపో అసిస్టెంట్ మేనేజర్ రజిత, టి.ఐ నారాయణ, ఉద్యోగులు పాల్గొన్నారు.