కందుకూరు, సెప్టెంబర్ 14: హైదరాబాద్, శ్రీశైలం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకువచ్చిన ఆర్టీసీ బస్సు దెబ్బడగూడ గేటు వద్ద కందుకూరు నుంచి కడ్తాల్ వైపు వెళ్తున్న కోళ్ల వ్యాన్ను ఢీకొట్టింది. అదే వేగంతో ముందుకెళ్లి మరో వ్యాన్ను ఢీకొట్టి పక్కనే ఉన్న పొదల్లోకి దూసుకెళ్లి చెట్టును ఢీకొట్టి ఆగింది.
ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ దేవస్వామి, కోళ్ల వ్యాన్ డ్రైవర్ మల్లయ్య, ప్రయాణికులు లక్ష్మణాచారి, సత్యం, సుగుణమ్మ, పార్వతమ్మ, ఎల్లమ్మ, శేఖర్తోపాటు పలువురికి గాయాలైనట్లు ఎస్ఐ కొండల్ తెలిపారు. గాయపడిన వారందరిని చికిత్స నిమిత్తం 108లో ఆస్పత్రికి
తరలించారు. కందుకూరు పోలీసులు కేసు దర్యాప్తు
చేస్తున్నారు.