నేడు మలక్‌పేటలో ఐటీ టవర్‌కు భూమిపూజ
మలక్‌పేట ప్రభుత్వ ఉద్యోగుల గృహసముదాయంలో నిర్మిస్తున్న ఐ టెక్ న్యూక్లియస్ ఐటీ టవర్‌కు సోమవారం ఉదయం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఐఐసీ)తోపాటు ఇతర సంస్థల ఉమ్మడి భాగస్వామ్యంతో 44.20 ఎకరాల్లో ఐటీ టవర్‌ను నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
- హాజరుకానున్న మంత్రి కేటీఆర్
సైదాబాద్, అక్టోబర్ 1: మలక్‌పేట ప్రభుత్వ ఉద్యోగుల గృహసముదాయంలో నిర్మిస్తున్న ఐ టెక్ న్యూక్లియస్ ఐటీ టవర్‌కు సోమవారం ఉదయం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఐఐసీ)తోపాటు ఇతర సంస్థల ఉమ్మడి భాగస్వామ్యంతో 44.20 ఎకరాల్లో ఐటీ టవర్‌ను నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే తొలి విడతగా 10.35 ఎకరాల్లో రూ.1,032 కోట్ల వ్యయంతో 21అంతస్తులతో 20లక్షల చదరపు అడుగుల్లో నిర్మిస్తున్నారు. భూమి పూజా కార్యక్రమానికి మంత్రి కేటీఆర్‌తోపాటు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ఎంపీలు అసదుద్దీన్ ఒవైసీ, కె.కేశవరావు, ప్రభుత్వ విఫ్ ఎంఎస్ ప్రభాకర్ రావు, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు, ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, మిర్జా రియాజ్ హసన్, ఏవీఎన్ రెడ్డి, మిర్జా అహ్మద్ బేగ్, ఎమ్మెల్యేలు అహ్మద్ బలాల, డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, టీఎస్ఐఏసీ ఎండీ వెంకట నర్సింహారెడ్డి, కలెక్టర్ అనుదీప్ గురిశెట్టి, అక్బర్‌బాగ్ డివిజన్ కార్పొరేటర్ సయ్యద్ మినాజుద్దీన్ తదితరులు పాల్గొననున్నారు.
– ఐ టెక్ న్యూక్లియస్ ఐటీ టవర్ నమూనా
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- IT tower
- KTR
- Malakpet
- TS government
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

