Errabelli |హైదరాబాద్: తెలంగాణ భవన్లో మంగళవారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూ యజమాని విద్యాసాగర్ అనుమతితోనే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేశాం. రాష్ట్ర ప్రభుత్వం పెద్ది అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించినపుడు విగ్రహాన్ని ఎందుకు కూలగొడతుంది అని అన్నారు. కాంగ్రెస్ నేతలకు సిగ్గుండాలి. కూల్చిన చోటే విగ్రహాన్ని పెట్టాలి. నర్సంపేటలోని ప్రతి గ్రామం లో పెద్ది విగ్రహం ఏర్పాటు చేస్తాం. నర్సంపేటలో అభివృద్ధి కార్యక్రమాలు పెద్ది ఎమ్మెల్యేగా ఉన్నపుడే జరిగాయి. నర్సంపేట మెడికల్ కాలేజీ కి పెద్ది పేరు పెట్టాలి. పెద్ది విగ్రహం యథాస్థానంలో పెట్టకపోతే తీవ్రపరిణామాలు ఉంటాయని ఎర్రబెల్లి హెచ్చరించారు.
ఈ సమావేశంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ బీ వినోద్ కుమార్, ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మా రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై సతీశ్ రెడ్డి పాల్గొన్నారు.