ప్రధాన చౌరస్తాలు, కూడళ్లలో పార్టీ జెండాలు ఎగురవేయాలి
ప్లీనరీ ఏర్పాట్లపై సమావేశంలో ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి
చర్లపల్లి, ఏప్రిల్ 20 : ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో టీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. బుధవారం చర్లపల్లి డివిజన్ పరిధిలోని ఈసీనగర్ కమ్యూనిటీ హాల్లో ఈ నెల 27న జరిగే టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం, ప్లీనరీ ఏర్పాట్లపై స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవి, డివిజన్ అధ్యక్షుడు డప్పు గిరిబాబు ఆధ్వర్యంలో కార్యకర్తలు, నాయకుల సమావేశాన్ని ని ర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని ప్రధాన చౌరస్తాలు, బస్తీ కూడళ్ల వద్ద జెండాలు ఎగురవేయాలని సూచించారు. ఈసీఐఎల్ చౌరస్తా, చక్రీపురం చౌరస్తా, కుషాయి గూడ, జయశంకర్ చౌరస్తా, సురానా చౌరస్తా, పెద్ద చర్లపల్లి చౌరస్తా.. తదితర ప్రాంతాల్లోని 15 చౌరస్తాల్లో జెండా కార్యక్రమం, స్వాగత తోరణాలు ఏర్పాటు చేయాలని అన్నారు.
మూడు రోజుల పాటు ద్విచక్రవాహనాల ర్యాలీలు, దూమ్ధామ్ కార్యక్ర మాలు నిర్వహించడంతో పాటు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు వినూ త్న కార్యక్రమాలు చేపడుతున్నామని ఎమ్మెల్యే అన్నారు. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర తొలి ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ.. పార్టీకి మచ్చ తెచ్చే విధంగా కార్యక్రమాలు చేపడితే.. తగు చర్యలు తీసుకుంటా మని, ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పార్టీని బలోపేతం చేయడంలో భాగ స్వామ్యం కావాలని అన్నారు. కార్పొరేటర్ బొంతు శ్రీదేవి మా ట్లాడుతూ.. డివిజన్లో ఆవిర్భావ దినోత్సవాలను పార్టీ నాయకులు, కార్యకర్తల భాగస్వామ్యంతో ఘనంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కా ర్పొరేటర్ సింగిరెడ్డి ధన్‌పాల్‌రెడ్డి, డివిజన్ ప్రధాన కార్యదర్శి అనిల్, నాయకులు అనుముల నర్సింహారెడ్డి, సప్పిడి శ్రీనివాస్ రెడ్డి, నేమూరి మహేశ్‌గౌడ్, జనుంపల్లి వెంకటేశ్వర్‌రెడ్డి, సింగిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, జాండ్ల సత్తిరెడ్డి, నాగిళ్ల బాల్‌రెడ్డి, బొడిగె ప్రభుగౌడ్, విద్యాసాగర్, కనకరాజుగౌడ్, గరిక సుధాకర్, కేవీఎల్ఎన్ రావు, నర్సింహగౌడ్, కడియాల బాబు, మొగిలి రాఘవరెడ్డి, జయకృష్ణ, వంశీరాజు, రెడ్డినాయక్, చెన్నయ్యగౌడ్, కొమ్ము రమేశ్, సురేశ్, నరేశ్, గంప కృష్ణ, వినోద్, ఎంకిరాల నర్సింహ, సర్ఫ్రాజు, నందకిశోర్, కర్రె సత్యనారాయణ, నాలుగుకాళ్ల వెంకటేశ్, మంద చంద్రమౌళి, పిట్టల విజయ్, రాధాకృష్ణ, హరినాథ్, నవనీత, లక్ష్మి, పుష్పలత, సత్తెమ్మ, ముత్యాలు, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పార్టీ బలోపేతానికి కృషి చేయండి..
మల్లాపూర్, ఏప్రిల్ 20 : ఈ నెల 27న జరిగే టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి పిలుపునిచ్చారు.. బుధవారం మల్లాపూర్ ఎస్ఎల్ఎన్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఆవిర్భావ వేడుకల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంగా ఉండి.. పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు.. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడు, కార్పొరేటర్ పన్నాల దేవేందర్‌రెడ్డి, మాజీ ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, డివిజన్ అధ్యక్షుడు కిరణ్ కుమార్‌రెడ్డి, కార్యదర్శి వాసుగౌడ్, బోదాసు లక్ష్మీనారాయణ, రాపోలు సతీశ్, కుంటి క్రిష్ణ, అండాలు, హమాలీ శ్రీనివాస్, జనుంపల్లి వెంకటేశ్వర్‌రెడ్డి, గరిక సుధాకర్, నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.