ఘనంగా టీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం
కార్యకర్తలందరూ సోదరభావంతో ఉంటూ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ముందుకు వెళ్లాలని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు.
- దీక్షా దివస్ సందర్భంగా కార్యకర్త్తలకు క్రీడా పోటీలు
- బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్
- ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్
జూబ్లీహిల్స్/ ఎర్రగడ్డ, నవంబర్ 29: కార్యకర్తలందరూ సోదరభావంతో ఉంటూ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ముందుకు వెళ్లాలని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. యూసుఫ్‌గూడ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యులతో మంగళవారం ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్ నాడు తెలంగాణ సాధన కోసం ఆమరణ దీక్ష చేపట్టి 13 ఏండ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా మంగళవారం దీక్షా దివాస్ నిర్వహించారు.
ఈ సందర్భంగా యూసుఫ్‌గూడ డివిజన్ కార్పొరేటర్, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్ బండారి రాజ్‌కుమార్ పటేల్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ కార్యకర్తలకు కబడ్డీ, ఖోఖో, క్యారమ్ బోర్డ్, చెస్, షెటిల్ తదితర పోటీలు నిర్వహించారు. పోటీలను ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రారంభించి కార్యకర్తలతో కలిసి చదరంగంతో పాటు వివిధ ఆటల్లో సరదాగా పాల్గొన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు సంతోశ్ ముదిరాజ్, నర్సింగ్‌దాస్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
జై కొట్టిన సింగరేణి
హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్‌దే విజయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

