బాలానగర్, ఫిబ్రవరి 11 : ట్రాన్స్ జెండర్లు బలవంతపు వాసులకు పాల్పడకుండా సమాజంలో గౌరవప్రదంగా జీవించాలని బాలనగర్ నరసింహారాజు అన్నారు. మంగళవారం బాలానగర్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ట్రాన్స్ జెండర్లతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాన్స్ జెండర్లు పెళ్లిళ్లు, పేరంటాలు, కూడళ్ళలో బలవంతపు వసూళ్లకు పాల్పడకుండా గౌరవంగా మసలుకోవాలని సూచించారు. ఫాన్స్ జెండర్లకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి అవకాశాలు పొందేందుకు అనేక అవకాశాలు కల్పిస్తుందని ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని సూచించారు. ట్రాన్స్ జెండర్ ల పేరుతో వసూళ్లకు పాల్పడుతూ గౌరవాన్ని కోల్పోకూడదు అని సూచించారు. హైదరాబాద్ సిటీ పోలీసులు ట్రాన్స్ జెండర్లకు ట్రాఫిక్ నియంత్రణ వాలంటీర్లుగా నియమించి ఉపాధి అవకాశాలు కల్పించిందని సూచించారు.
ఉపాధి అవకాశాల వైపు అడుగులు వేస్తూ గౌరవంగా జీవించాలని సూచించారు. ట్రాన్స్ జెండర్లు కనీస విద్యారత లేకపోవడం వలన భిక్షాటనకు అలవాటు పడుతున్నారని పేర్కొన్నారు. ఓపెన్ స్కూల్ లలో విద్యాభ్యాసం చేయవచ్చని తద్వారా కనీస విద్యార్రత పొందినట్లు అవుతుందని సూచించారు. కనీస విద్యారత లేని ట్రాన్స్ జెండర్ లు కొంతమంది సెక్స్ వర్కర్లుగా అవతారం ఎత్తి దుర్భర జీవితాలు గడుపుతున్నారని తెలిపారు. సమాజంలో ట్రాన్స్ జెండర్ల పట్ల ప్రత్యేక గౌరవం లభించాలంటే బలవంతపు వసూళ్లకు పాల్పడడం, వ్యభిచారానికి పాల్పడడం లాంటి పనులను మానుకోవాలని సూచించారు. ట్రాన్స్ జెండర్ లకు పోలీస్ వ్యవస్థ అండగా ఉంటుందని సూచించారు. కానీ ట్రాన్స్ జెండర్లు కూడా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ట్రాన్స్ జెండర్ ల పనితీరు పట్ల ఎవరైనా ఫిర్యాదు చేసిన ఎడల చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.