BC Welfare | సిటీ బ్యూరో, జూన్ 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర అత్యంత వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు వివిధ నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ ముఖ్యకార్యనిర్వాహణ అధికారి కే అలోక్ కుమార్ తెలిపారు. సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్, పర్సనాలిటీ డెవలప్మెంట్, రెజ్యూమ్ బిల్డింగ్, కమ్యూనికేషన్ ఫౌండేషన్, మాక్ ఇంటర్వ్యూలు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్, మెంటల్ వెల్ బీయింగ్ ట్రైనింగ్‌పై శిక్షణ ఇస్తామని ఆయన వెల్లడించారు. ఈ శిక్షణ నాలుగ రోజులు ఉంటుందని, అలాగే శిక్షణ సమయంలో అభ్యర్థులకు ట్రావెలింగ్, భోజన వసతి సదుపాయము కల్పిస్తామని తెలిపారు. శిక్షణకు డిగ్రీ ఉత్తీర్ణత సాధించి 21 నుంచి 30 ఏండ్ల లోపు ఉండాలని అన్నారు. ఎంబీసీ కుల ధ్రువీకరణ పత్రం తప్పనిసరి అని చెప్పారు. ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికి ఏడాదికి రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల వారికి రూ.2 లక్షలకు మించరాదని తెలిపారు. అభ్యర్థులు నేటి నుంచి జూన్ 12 వరకు ఎంబీసీ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకుని సంబంధిత పత్రాలను జిల్లా బీసీ అభివృద్ధి అధికారి కార్యాలయంలో జూన్ 14వ తేదీ లోగా సమర్పించాలని వెల్లడించారు.