ఎన్నికలపై పోలీసు సిబ్బందికి శిక్షణ
ఎన్నికల నియమావళి అమలు చేయడం, ఉల్లంఘనలపై తీసుకోవాల్సిన చర్యలు, శాంతియుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై బుధవారం సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్ల స్థాయి అధికారులకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.
సిటీబ్యూరో, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): ఎన్నికల నియమావళి అమలు చేయడం, ఉల్లంఘనలపై తీసుకోవాల్సిన చర్యలు, శాంతియుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై బుధవారం సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్ల స్థాయి అధికారులకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర బుధవారం జూమ్ మీటింగ్ ద్వారా అధికారులకు ఎన్నికల నిర్వహణ, భద్రతా పరంగా తీసుకోవాల్సిన చర్యలు, ఎన్నికల నియమావళి అమలు చేయడం, నియమావళిని ఉల్లంఘించిన వారిపై ఎలాంటి చర్యలు, ఎన్నికల నియమావళి ఉల్లంఘనల పరిధిలోకి వచ్చే అంశాలు.. తదితర అంశాలను సీపీ స్పష్టంగా అధికారులకు వివరించారు. శిక్షణా కార్యక్రమంలో భాగంగా లీగల్ అడ్వైజర్ ఏవూరి రాములు మాట్లాడుతూ.. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనలపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు అవసరమైన న్యాయపరమైన అంశాలు, పీపుల్స్ యాక్ట్, ఇండియన్ పీనల్ కోడ్, హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్, మోటారు వెహికిల్ యాక్ట్, ముందుజాగ్రత్త చర్యలు.. తదితర అంశాలపై అవగాహన కల్పించారు. క్రైమ్ డీసీపీ కమలేశ్వర్ మాట్లాడుతూ.. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన నేరస్తులపై ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, ఆర్ఈ అధికారుల సహకారంతో కేసులు నమోదు చేసే అంశాలను వివరించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో అడ్మిన్ డీసీపీ యోగేశ్ గౌతమ్, బాలానగర్ డీసీపీ శ్రీనివాసరావు, మేడ్చల్ డీసీపీ శబరీశ్, శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి, రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి, మాదాపూర్ డీసీపీ సందీప్, ఎలక్షన్ సెల్ డీసీపీ అశోక్‌కుమార్ పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

