Hyderabad | న్యూఇయర్ సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. రాత్రి 11 నుంచి ఫ్లైఓవర్లు బంద్
Hyderabad | న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నేపథ్యంలో హైదరాబాద్‌లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇవాళ రాత్రి 11 గంటల నుంచి 2 గంటల వరకు ఆంక్షలు కొనసాగున్నాయి.
Hyderabad | న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నేపథ్యంలో హైదరాబాద్‌లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇవాళ రాత్రి 11 గంటల నుంచి 2 గంటల వరకు ఆంక్షలు కొనసాగున్నాయి. ఇక బేగంపేట, టోలీచౌకీ ఫ్లైఓవర్ మినహా మిగతా ఫ్లైఓవర్లన్నీ రాత్రి 10 నుంచి జనవరి 1వ తేదీ ఉదయం వరకు అవనసరాన్ని బట్టి బంద్ చేస్తామని ఇంచార్జి ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ వెంకటేశ్వర్లు తెలిపారు. అన్ని ప్రైవేటు వాహనాలు సిటీలోకి రాకుండా ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా వెళ్లాలని సూచించారు.
ట్యాంక్‌బండ్, నెక్లస్ రోడ్ వంటి చోట్ల రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున రెండుగంటల వరకు వాహనాల రాకపోకలు నిషేధిస్తున్నట్లు పేర్కొన్నారు. 217 ప్రాంతాల్లో తనిఖీలు చేస్తారని, ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లస్రోడ్ వంటి రద్దీ ప్రాంతాలు, షాపింగ్ మాల్స్ ఉన్నచోట ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వివరించారు. ఫ్లైట్ టికెట్ ఉంటేనే పీవీ ఎక్స్‌ప్రెస్ హైవే పైకి అనుమతించనున్నారు. మద్యం తాగి వాహనాలు నడపరాదని, డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు రాత్రి ఎనిమిది గంటలనుంచే కొనసాగుతాయని తెలిపారు. ర్యాష్ డ్రైవింగ్,ట్రాఫిక్ నిబంధనలకు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

