సిటీబ్యూరో, మార్చి 24(నమస్తే తెలంగాణ): రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఇఫ్తార్ విందు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ ఓ ప్రకటనలో తెలిపారు.
ఏఆర్ పెట్రోల్ పంప్ నుంచి బీజేఆర్ విగ్రహం వరకు వెళ్లే ట్రాఫిక్‌ను నాంపల్లి వైపునకు మళ్లిస్తామని, బషీర్‌బాగ్ నుంచి ఏఆర్ పెట్రోల్ పంప్ వైపు బీజేఆర్ విగ్రహం నుంచి వచ్చే ట్రాఫిక్‌ను నాంపల్లి స్టేషన్ రోడ్‌లోని అబిడ్స్ ఎస్బీహెచ్ వరకు బీజేఆర్ విగ్రహం మీదుగా మళ్లిస్తామని ఆయన పేర్కొన్నారు. సుజాతస్కూల్ లేన్ నుంచి ఖాన్‌లతీఫ్‌ఖాన్ బిల్డింగ్‌కు వచ్చే ట్రాఫిక్‌ను సుజాత స్కూల్ జంక్షన్ వద్ద నాంపల్లి వైపుగా మళ్లిస్తామన్నారు.
ట్రాఫిక్ ఆంక్షలు ఉన్న సమయంలో పంజాగుట్ట, వీవీ విగ్రహం, రాజీవ్ గాంధీ విగ్రహం, నిరంకారి, ఓల్డ్ సైఫాబాద్ పీఎస్, లక్డీకపూల్, ఇక్బాల్మినార్, రవీంద్రభారతి, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ జంక్షన్, బషీర్‌బాగ్, బీజేఆర్ విగ్రహం సర్కిల్, గన్‌ఫౌండ్రీ ఎస్బీఐ, అబిడ్స్ సర్కిల్, ఏఆర్ పెట్రోల్‌పంప్, నాంపల్లి, కేఎల్కే బిల్డింగ్, లిబర్టీ, హిమాయత్‌నగర్, అసెంబ్లీ, ఎంజెమార్కెట్, హైదర్‌గూడ జంక్షన్లలో ప్రయాణించవద్దని, నగర ప్రజలు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రయాణాలు కొనసాగించాలని జోయల్ డేవిస్ సూచించారు.