Traffic Restrictions | సిటీబ్యూరో, ఏప్రిల్ 22(నమస్తే తెలంగాణ): ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ ఉండటంతో స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు తెలిపారు. బుధవారం సాయంత్రం 4 నుంచి రాత్రి 11.50 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని, చెంగిచర్ల, బోడుప్పల్, పీర్జాదిగూడ వైపు నుంచి వచ్చే వాహనాలను హెచ్ఎండీఏ భగాయత్ నుంచి నాగోల్ వైపు, ఎల్బీనగర్ వైపు నుంచి వచ్చే వాహనాలను నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద నుంచి హెచ్ఎండీఏ లేఅవుట్ వైపు, తార్నాక నుంచి వచ్చే వాహనాలను హబ్సిగూడ నుంచి చర్లపల్లి వైపు, రామంతాపూర్ నుంచి వచ్చే వాహనాలు స్ట్రీట్ నంబర్ 8 నుంచి హబ్సిగూడ వైపు మళ్లిస్తున్నట్లు వెల్లడించారు.