రేపు పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ సభ.. ఆ మార్గాల్లో ప్రయాణించొద్దని పోలీసుల సూచన
హైదరాబాద్ : ఈ నెల 3వ తేదీన సాయంత్రం 5 గంటలకు పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ బహిరంగ సభ జరగనుంది. ఈ సభలో మోదీతో పాటు పలువురు బీజేపీ నాయకులు పాల్గొని ప్రసంగించనున్నారు. మోదీ రాక నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు పరేడ్ గ్రౌండ్స్ తో పాటు ఆ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతే కాకుండా ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు.
హెచ్ఐసీసీ మాదాపూర్ – జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు – కేబీఆర్ పార్క్ – పంజాగుట్ట – గ్రీన్ ల్యాండ్స్ – బేగంపేట – పరేడ్ గ్రౌండ్స్ రహదారిపై ఆంక్షలు ఉంటాయన్నారు. టివోలి క్రాస్ రోడ్స్ – ప్లాజా క్రాస్ రోడ్స్ దారి కూడా మూసివేయనున్నట్లు తెలిపారు.
ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ..
చిలకలగూడ క్రాస్ రోడ్స్, అలుగడ్డ బాయి క్రాస్ రోడ్స్, సంగీత్ క్రాస్ రోడ్స్, వైఎంసీఏ క్రాస్ రోడ్స్, ప్యాట్నీ క్రాస్‌రోడ్స్, ఎస్బీహెచ్ క్రాస్‌రోడ్స్, ప్లాజా, సీటీవో జంక్షన్, బ్రూక్‌బాండ్ జంక్షన్, టివోలి జంక్షన్, త్రైక్బాండ్ జంక్షన్, స్వీక్ క్లబ్లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుందన్నారు. డైమండ్ పాయింట్, బోయిన్పల్లి క్రాస్‌రోడ్స్, రసూల్‌పురా, బేగంపేట్, ప్యారడైజ్ ఏరియాల్లోనూ ట్రాఫిక్ ఉండే అవకాశం ఉందన్నారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పరేడ్ గ్రౌండ్స్‌కు మూడు కిలోమీటర్ల పరిధిలోని అన్ని జంక్షన్లు, రోడ్ల వైపు రాకుండా ఉండాలన్నారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎంజి రోడ్, ఆర్పి రోడ్, ఎస్డి రోడ్ల వైపు కూడా రావొద్దని పోలీసులు కోరారు.
సికింద్రాబాద్ స్టేషన్లోకి 10వ ప్లాట్ ఫాం నుంచి వెళ్లాలి..
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి సాయంత్రం రైళ్లలో ప్రయాణించాలనుకునే ప్రయాణికులు సకాలంలో స్టేషన్‌కు చేరుకోవాలని పోలీసులు సూచించారు. ప్లాట్ ఫాం 1 నుంచి కాకుండా ప్లాట్ ఫాం 10 నుంచి స్టేషన్ లోకి వెళ్లాలని చెప్పారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gas Refilling | అక్రమంగా వంట గ్యాస్ రీఫిల్లింగ్.. ముగ్గురు వ్యక్తులు అరెస్ట్
అర్హులైన ప్రతి కుటుంబానికి జీవిత బీమా
Life style | మీ బాత్రూమ్ కంపు కొడుతున్నదా.. అయితే ఈ టిప్స్‌తో సమస్యకు చెక్ పెట్టండి..!
Nitin Nabin | రాహుల్‌గాంధీకి దేశాభివృద్ధి కాదు.. తన కుటుంబ అభివృద్ధే కావాలి : నితిన్ నబీన్
జాతీయ క్రీడల్లో సెయింట్ జోసెఫ్ విద్యార్థుల జయకేతనం
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరుల మెడలో కోటి విలువైన కరెన్సీ దండలు.. వారిని ఆశ్చర్యపరిచిన బావ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

