Traffic Restrictions | నేటి నుంచి ముసారాంబాగ్ బ్రిడ్జి మూసివేత.. ట్రాఫిక్ మళ్లింపులు ఇలా..
Traffic Restrictions | హైదరాబాద్‌లోని ముసారాంబాగ్ వద్ద మూసీ నదిపై ఫ్లై ఓవర్ నిర్మిస్తున్నారు. ఈ ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల నేపథ్యంలో అంబర్‌పేట - మలక్‌పేట మధ్య రాకపోకలు సాగించే రహదారిపై ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు.
Traffic Restrictions | హైదరాబాద్ : హైదరాబాద్‌లోని ముసారాంబాగ్ వద్ద మూసీ నదిపై ఫ్లై ఓవర్ నిర్మిస్తున్నారు. ఈ ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల నేపథ్యంలో అంబర్‌పేట – మలక్‌పేట మధ్య రాకపోకలు సాగించే రహదారిపై ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలు శనివారం నుంచే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తయ్యే వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. ఈ కొత్త ఫ్లై ఓవర్‌ను అలీ కేఫ్ చౌరస్తా నుంచి పిస్తా హౌజ్ వరకు నిర్మించనున్నారు.
అంబర్పేట్ నుంచి మలక్‌పేట టీవీ టవర్ వైపు వెళ్లే అన్ని వాహనాలను అలీ కేఫ్ ఎక్స్ రోడ్డు వద్ద జిందా తిలిస్మాత్ వైపు మళ్లించనున్నారు. అటు నుంచి గోల్నాక న్యూ బ్రిడ్జి, హైటెక్ ఫంక్షన్ హాల్, అఫ్జల్ నగర్ వైపు మళ్లించనున్నారు. ఇక మలక్‌పేట నుంచి అంబర్‌పేట వైపు వచ్చే వాహనాలను ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద మళ్లించనున్నారు. అటు నుంచి అఫ్జల్ నగర్, గోల్నాక న్యూబ్రిడ్జి, జిందా తిలిస్మాత్, అలీ కేఫ్ ఎక్స్ రోడ్డు నుంచి అంబర్‌పేట జంక్షన్ వైపు వాహనాలను మళ్లించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు.
#HYDTPinfo #TrafficAlert
Commuters please note the #Notification in connection with the construction of #HighLevelBridge connecting Moosarambagh on #MusiRiver from Ali Café X road to Pista House. #TrafficRestrictions #TrafficDiversions from 23.12.23 till completion of work. pic.twitter.com/flkmMLaAvT— Hyderabad Traffic Police (@HYDTP) December 23, 2023
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

