హైదరాబాద్ : నగరంలోని ఖైరతాబాద్ – రాజ్‌భవన్ రహదారిపై పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సోమాజిగూడ, బేగంపేట వెళ్లే దారిలో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో సీఎం కేసీఆర్‌కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో పోలీసులు ఆ ఏరియాలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే యశోద ఆస్పత్రికి మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌తో పాటు వారి కుటుంబ సభ్యులు చేరుకున్నారు.