Traffic Restrictions | సిటీబ్యూరో, జనవరి 30 (నమస్తే తెలంగాణ) : ఎల్బీస్టేడియంలో నర్సు రిక్రూట్మెంట్ సందర్భంగా ఎల్బీస్టేడియం పరిసరాల్లో బుధవారం మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 7 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ అదనపు సీపీ విశ్వప్రసాద్ తెలిపారు.
ఏఆర్ పెట్రోల్ బంక్ నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వెళ్లే వాహనాలను నాంపల్లి వైపు మళ్లిస్తారు. బషీర్బాగ్ నుంచి ఏఆర్ పెట్రోల్ బంక్ వైపు వచ్చే వాహనాలను ఎస్బీహెచ్, అబిడ్స్, నాంపల్లి స్టేషన్ రోడ్డుకు మళ్లించనున్నట్లు అదనపు సీపీ వెల్లడించారు.