సిటీబ్యూరో, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): దూలపల్లి గ్రామం నుంచి దూలపల్లి టి -జంక్షన్ వరకు చేపట్టిన కల్వర్ట్ నిర్మాణ పనుల సందర్భంగా దూలపల్లి, ఆ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ టి.శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆంక్షలు శుక్రవారం నుంచి డిసెంబర్ 31 వరకు 60 రోజుల పాటు అమలులో ఉంటాయని, దీనిని దృష్టిలో పెట్టుకొని అటుగా వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని డీసీపీ సూచించారు.