Goshamahal | అబిడ్స్, మార్చి 11: గోషామహల్ ప్రధాన రహదారిలో నాలా కూలిపోవడంతో గత కొన్ని రోజులుగా వాహనాలను మళ్లిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ట్రాఫిక్ అధికారులు ఆ ప్రాంతాన్ని మంగళవారం సందర్శించారు. స్థానిక నాయకులు ఆల పురుషోత్తం రావు, సురేష్ ముదిరాజ్ల విజ్ఞప్తి మేరకు గోషామహల్ ట్రాఫిక్ ఏసిపి ధనలక్ష్మి, ఇన్స్పెక్టర్ బాలాజీ, జిహెచ్ఎంసి ఏఈ మహేందర్ ఆ ప్రాంతాన్ని సందర్శించారు.
గోషామహల్ ప్రధాన రహదారి మీదుగా వాహనాల రాకపోకలను నిలిపివేయడంతో వ్యాపారాలు నడవక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వ్యాపారులు వాపోతున్నట్టు ఆల పురుషోత్తం రావు, సురేష్ ముదిరాజ్లు పేర్కొన్నారు. వెంటనే ద్విచక్ర వాహనాల రాకపోకలు సాగేలా చర్యలు తీసుకోవాలని వారు ఏసీబీ ధనలక్ష్మికి విజ్ఞప్తి చేశారు. ఆమె ద్విచక్ర వాహనాల రాకపోకలను పునరుద్ధరించేందుకు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ట్రాఫిక్ ఏసిపి ఏఈ మహేందర్తో మాట్లాడి నాలా పైకప్పు నిర్మాణ పలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కోరినట్లు పురుషోత్తం రావు తెలిపారు.