Hyderabad | కాచిగూడ, సెప్టెంబర్ 7 : ఫుట్‌పాత్‌లపై వ్యాపారాలు కొనసాగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈస్ట్‌జోన్ ట్రాఫిక్ ఏసీపీ అనుమల శ్రీనివాస్ హెచ్చరించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కాచిగూడ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఏ.శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదివారం కాచిగూడ రైల్వేస్టేషన్ ప్రాంతాల్లో ఫూట్‌పాత్‌పై ఉన్న ఆక్రమణాలను ఈస్ట్‌జోన్ ట్రాఫిక్ ఏసీపీ, ట్రాఫిక్ సిఐ సిబ్బందితో తొలగించారు.
అనంతరం ఈస్ట్‌జోన్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఫుట్‌పాత్‌లను ఆక్రమించుకొని వ్యాపారాలు కొనసాగిస్తే కేసులు నమోదు చేసి, నెల రోజులు జైలు శిక్ష విధించబడుతుందని పేర్కొన్నారు. అక్రమ పార్కింగ్తో స్థానికులు, వాహనదారులు, బాటసారులు, ఇబ్బందులు పడుతారని పేర్కొన్నారు. పాదచారులకు ఇబ్బంది కలిగించే విధంగా ఫుట్‌పాత్‌లపై వ్యాపారాలు చేసుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల సౌకర్యార్ధం కోసం రోడ్లపై వ్యాపారాలు చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడితే 8712660646కు సమాచారం అందించాలని సీఐ విజ్ఞప్తి చేశారు.