సిటీబ్యూరో, జూన్ 1 (నమస్తే తెలంగాణ ) : మలక్‌పేటలో డ్రైనేజీ నీరు ఉప్పొంగడంతో ఏర్పడిన ట్రాఫిక్ జామ్ నివారణకు చేపట్టిన పనులను కమిషనర్ ఆర్ వీ కర్ణన్ ఆదివారం పరిశీలించారు. వీలైనంత త్వరగా పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రస్తుతం ట్రాఫిక్ జామ్‌కు అవకాశం లేదని, యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నామని, భవిష్యత్‌లో సమస్య రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్ఈ మహేశ్వర్ రెడ్డి వివరించారు. అనంతరం నెక్లెస్ రోడ్డు రైల్వే స్టేషన్ నుంచి కుందన్‌బాగ్ వరకు చేపట్టే ఆర్డీపీ పనులను పరిశీలించారు.