హైదరాబాద్: నగరంలోని ప్రధాన ఆలయ్యాల్లో ఒకటైన బల్కంపేట ఎల్లమ్మ (Balkampeta Ellamma) దేవాలయం కల్యాణోత్సవానికి ముస్తాబవుతున్నది. ఈ నేపథ్యంలో ప్రధాన రహదారిపై పోలీసులు ఆక్షలు విధించారు. ప్రధాన రహదారి ఇరువైపుల మూసివేశారు. వాహనాలను దారిమళ్లిస్తున్నారు. ఈ నెల 10న సాయంత్రం 8 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు వెల్లడించారు. ఎల్లమ్మ ఆలయంలో కల్యాణం పనులు జరుగుతున్న నేపథ్యంలో రోడ్డును మూసివేశామని చెప్పారు. అందువల్ల వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు.
మళ్లింపు ఇలా..
– అమీర్‌పేట, బేగంపేట నుంచి వస్తున్న వాహనాలను ఎస్ఆర్నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మీదుగా సోనీ వైన్స్, ఉమేష్‌చంద్ర విగ్రహం మీదుగా పంపిస్తున్నారు.
– సనత్‌నగర్, ఫత్తేనగర్, బేగంపేట బైపాస్ రోడ్డు నుంచివస్తున్న వాహనాలను సిక్స్ ఫీట్ రోడ్డు నుంచి, బల్కంపేట బతుకమ్మ చౌరస్తా మీదుగా ఎస్ఆర్నగర్, అమీర్‌పేట మీదుగా తరలిస్తున్నారు.
కాగా, ఈ నెల 9న ఎల్లమ్మ కల్యాణం జరుగనున్నది. ఈ నేపథ్యంలో ఆలయ సమీపంలో నాలుగు చోట్ల వాహనాల పార్కింగ్‌కు పోలీసులు ఏర్పాటు చేశారు. ఫత్తేనగర్ రైల్వే సమీపంలోని ఫ్లైవోవర్ బ్రిడ్జి కింద ఇరు వైపులా, బల్కంపేట ప్రకృతి చికిత్సాలయం, ఎస్ఆర్నగర్లోని రోడ్లు భవనాల శాఖ, అమీర్‌పేటలోని శ్రీ గురుగోబింద్‌సింగ్ ప్లే గ్రౌండ్లలో భక్తులు తమ వాహనాలు నిలుపుకోవాలని సూచించారు.