Hyderabad | మలక్‌పేట, ఫిబ్రవరి 15 : పోగొట్టుకున్న డబ్బులు, సెల్ ఫోన్‌ను తిరిగి మహిళకు అప్పగించిన మలక్‌పేట ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను, హోంగార్డును పలువురు అభినందించారు.
వివరాల్లోకి వెళ్తే.. మలక్‌పేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ మమత, హోంగార్డ్ నరసింహారావు ఎగ్జిబిషన్ గ్రౌండ్ మూడవ గేటు వద్ద విధులు నిర్వహిస్తున్నారు. అదే గేటు వద్ద ఓ మహిళ తన పర్సును పోగొట్టుకుంది. రోడ్డుపై పడిఉన్న పర్సును గమనించిన కానిస్టేబుల్ మమత, హోంగార్డు నరసింహారావులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. పర్సును తెరిచి చూడగా అందులో సెల్ ఫోను, డబ్బులు ఉండటంతో మహిళను వెతికి అప్పగించారు. దాంతో పోలీసుల నిజాయితీ, అంకితభావం పట్ల మహిళ కృతజ్ఞతలు తెలుపగా, ఎగ్జిబిషన్‌కు వచ్చిన పలువురు వ్యక్తులు అభినందించారు.