హైదరాబాద్ : ఆస్తిలో వాటా ఇవ్వాలని మామ పై ట్రాఫిక్ కానిస్టేబుల్(Traffic constable) దాడికి పాల్పడిన సంఘటన లంగర్‌హౌస్‌లో(Langerhouse) చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. లంగర్హౌస్కి చెందిన కానిస్టేబుల్ ఎం.డి. షాహిద్ ఖాన్ అనే వ్యక్తి గత కొద్దీ రోజులుగా మామ ఆస్తిలో తనకు కూడా వాటా ఇవ్వాలంటూ ఇందిరా నగర్లో ఉంటున్న మామ అబ్దుల్ వాహిద్ పై దాడికి పాల్పడ్డాడు. తనకి ఆస్తిలో వాటా ఇవ్వకపోతే మామ కుటుంబ సభ్యులందరి అంతు చూస్తానాంటూ బెదిరింపులకి పాల్పడ్డాడు. తనను ఎవరు ఏమి చేయలేరంటూ మామ కుటుంబం షాహిద్ ఖాన్ పై చిందులేశారు. తమకు కానిస్టేబుల్ షాహిద్ నుంచి ప్రాణ హాని ఉందంటూ బాధితుడు అబ్దుల్ మోహిద్ జూబ్లీహిల్స్ పోలీసులకు పిర్యాదు చేశాడు. నిందితుడి పై కేసు నమోదు చేసి శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆస్తిలో వాటా ఇవ్వాలని మామ పై దాడికి పాల్పడిన ట్రాఫిక్ కానిస్టేబుల్
హైదరాబాద్ – లంగర్హౌస్కి చెందిన కానిస్టేబుల్ ఎం.డి.షాహిద్ ఖాన్ అనే వ్యక్తి గత కొద్దీ రోజులుగా మామ ఆస్తిలో తనకు కూడా వాటా ఇవ్వాలంటూ ఇందిరా నగర్లో ఉంటున్న బామ్మర్ది అబ్దుల్ వాహిద్ మరియు మామ పై దాడికి… pic.twitter.com/ILWDFMT8QL
— Telugu Scribe (@TeluguScribe) November 20, 2024