Traffic Rules | మలక్‌పేట, మార్చి 4 : ట్రాఫిక్ నియమాలను పాటించని వాహన చోదకులపై కఠిన చర్యలు తీసుకున్నట్లు ట్రాఫిక్- 3 అడిషనల్ డీసీపీ రవీంద్రారెడ్డి అన్నారు. మలక్‌పేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ముసారాంబాగ్, నల్గొండ చౌరస్తా ఆజంపురా చౌరస్తాలలో మంగళవారం అంబులెన్స్‌ల చెకింగ్, రాంగ్ రూట్లో రైడింగ్, నంబర్ ప్లేట్ లేకుండా తిరిగే వాహనాలపై నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌కు సౌత్ ఈస్ట్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ చంద్రకుమార్‌తో పాటు ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా నంబర్ ప్లేట్ లేకుండా నడుపుతున్న, రాంగ్ రూట్లో వెళ్తున్న వాహనదారులకు ఫైన్లు విధించారు. అదేవిధంగా పేషెంట్ లేకుండా సైరన్లు మోగిస్తూ వెళ్తున్న అంబులెన్స్‌లను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాహన చోదకులు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించి సురక్షిత ప్రయాణాలను కొనసాగించాలని సూచించారు. వాహన చోదకుల సురక్షిత ప్రయాణాల కోసమే ట్రాఫిక్ నియమాలని, వాటిని ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. రాంగ్ రూట్లో డ్రైవ్ చేయడం ప్రమాదకరమని, నంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు నడపడం మోటార్ వెహికల్ చట్టం ప్రకారం నేరమన్నారు. ఇటీవల కాలంలో పేషెంట్లు లేకుండా అంబులెన్సుల డ్రైవర్లు సైరన్ ను మోగిస్తూ వెళ్తూ ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ట్రాఫిక్ నియంత్రణతో పాటు ప్రమాదాల నివారణకు మలక్ పేట ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన ఈ స్పెషల్ డ్రైవ్ లు అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సౌత్ ఈస్ట్ ట్రాఫిక్ ఏసిపి చంద్రకుమార్, మలక్ పేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్, ఎస్సైలు రాము, రామస్వామి, , యాదయ్య, వినోద్, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.