Megastar Chiranjeevi – Jaggareddy | టాలీవుడ్ అగ్రనటుడు మెగాస్టార్ చిరంజీవిపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతుల సమస్యలపై ఖైదీ నం150 అనే సినిమా తీసిన మెగాస్టార్ చిరంజీవి.. ఢిల్లీలో రైతులు ధర్నాలు చేసినప్పుడు ఎందుకు మద్దతు ఇవ్వలేదని ప్రశ్నించారు. ‘ఖైదీ నం150’ సినిమాతో కోట్ల రూపాయలు సంపాదించిన చిరంజీవి రైతుల సమస్యల గురించి ఎందుకు పట్టించుకోవట్లేదని జగ్గారెడ్డి అన్నాడు.
రైతుల పేరుతో సినిమాలు తీస్తూ.. రైతులను ఇబ్బంది పెడుతున్న ప్రధాని మోదీకి మద్దతు ఇస్తున్నారని విమర్శించారు. మోదీకి పవన్‌కు మాత్రమే ఎందుకుచిరు సపోర్ట్ చేస్తున్నాడని.. రైతుల తరపున మాట్లాడుతున్న రాహుల్ గాంధీకి ఎందుకు అండగా నిలబడట్లేదని జగ్గారెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉండి ఉంటే చిరంజీవి సరిగ్గా ఉండేవారని… ఇప్పుడు పక్కదారి పట్టారని అన్నారు.
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ జగ్గారెడ్డి గారి ప్రెస్ మీట్ గాంధీ భవన్ https://t.co/Q74YvLszRA
— Telangana Congress (@INCTelangana) July 19, 2024
Also Read..