Thangalaan Movie | కోలీవుడ్‌తో పాటు పాన్ ఇండియా ప్రేక్షకుల ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో తంగలాన్ (Thangalaan) ఒకటి. తమిళ హీరో చియాన్ విక్రమ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు ‘కబాలి’, ‘కాలా’, ‘సర్పట్ట పరంపర’ చిత్రాల ఫేమ్ పా. రంజిత్ (Pa Ranjith) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే మూవీ నుంచి టీజర్‌తో పాటు ట్రైలర్ విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్ రావడంతో పాటు సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. అయితే ఈ సినిమా విడుదల తేదీ ఎప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే మూవీ విడుదల తేదీని చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ సినిమాను ఇండిపెండెన్స్ కానుకగా ఆగష్టు 15న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
ఈ సినిమాను మొదట ఈ ఏడాది జనవరి 26 విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. అనుకోని కారణాల వలన వాయిదా పడింది. ఇక ఆ తర్వాత ఫిబ్రవరిలో విడుదల చేద్దామనుకున్నారు మేకర్స్. కానీ అప్పుడు కూడా ఈ సినిమాకు కలిసి రాలేదు. దీంతో తాజాగా
ఇండిపెండెన్స్ కానుకగా తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఆగష్టు 15న డబల్ ఇస్మార్ట్‌తో పాటు బాలీవుడ్ నుంచి స్త్రీ 2 వస్తుంది. ఇక అదే రోజు తంగలాన్ కూడా వస్తుండటంతో బాక్సాఫీస్ వద్ద ఈ మూడు సినిమాలకు క్లాష్ ఏర్పడే అవకాశం ఉంది.
కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్)లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా వస్తోన్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కేఈ జ్ఞానవేళ్ రాజా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో మాళవికా మోహనన్, పార్వతి తిరువొతు ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తుండగా.. ‘సర్పట్ట పరంపర’ ఫేమ్ పశుపతి, డానియెల్ కల్టగిరోన్ కీ రోల్స్ పోషిస్తున్నారు.
Rising from the ashes, to whisper loud the truth 🔥#Thangalaan is releasing worldwide on August 15th.#ThangalaanFromAug15 💙@Thangalaan @chiyaan @GnanavelrajaKe @StudioGreen2 @OfficialNeelam @parvatweets @MalavikaM_ @gvprakash @NehaGnanavel @dhananjayang @NetflixIndia… pic.twitter.com/UF1BXWNaaL
— pa.ranjith (@beemji) July 19, 2024
Also Read..