చదువుల మంత్రి సబితమ్మ బుధవారం మహేశ్వరం మండలం పరిధిలోని గొల్లూరు నుంచి పెద్ద గోల్కొండ ఓఆర్‌ఆర్‌వైపు తన కాన్వాయ్‌లో వెళ్తుండగా.. ఇద్దరు విద్యార్థులు మంత్రికి కనిపించారు. వెంటనే తన కాన్వాయ్‌ని ఆపిన మంత్రి.. ఆ విద్యార్థులతో మాట్లాడి, చాక్లెట్ ఇచ్చారు.
విద్యార్థులను కారు ఎక్కించుకొని వారి ఇంటి వద్ద దింపారు. మంత్రి తన కాన్వాయ్‌లో తీసుకురావడంతో విద్యార్థుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. విద్యార్థుల తల్లి దండ్రులు ఈ సందర్భంగా మంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
– మహేశ్వరం, సెప్టెంబర్ 20